బాలనటి నుండి హీరోయిన్‌గా…కావ్య

కావ్య… పేరుతో పరిచయం లేకపోయినా ‘గంగోత్రి’ సినిమా లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి  పిట్ట…’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుందిగా….ఆ పాపే కావ్య.  ఇప్పుడు తను హీరోయిన్‌ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ…. “‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’ తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ చేస్తున్నాను. లాక్‌డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్‌ స్టార్ట్‌ చేశాను. లాక్‌డౌన్‌ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్‌ , ఛాలెంజింగ్‌ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు.