ఏపీ జెన్ కో ఉద్యోగుల పోరాటానికి పూర్తి మద్దతు: బొబ్బేపల్లి సురేష్ బాబు

సర్వేపల్లి, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సమీపంలోని నేలటూరు వద్ద ఉన్న ఏపీ జెన్ కో కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం 25 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడానికి జనసేన పార్టీ తరఫున తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి పోరాటానికి తాము సంపూర్ణంగా పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు తెలిపారు. గురువారం ఉదయం విద్యుత్ థర్మల్ ప్లాంట్ ఎదురుగా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనకు జనసేన తరపున మద్దతు తెలిపి వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ జెన్ కో ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ను లీజు పేరుతో ప్రైవేటీకరణ చేస్తే తాము చూస్తూ ఊరుకోం. లీజుకు వ్యతిరేకంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో కలిసి పోరాటం చేస్తాం. వైసిపి ప్రభుత్వ పెద్దలపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తారా. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసిపి ప్రభుత్వ పెద్దలు ఇది తమ పరిధిలోకి రాదని ఆనాడు మాయమాటలు చెప్పారు.నేడు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ జెన్ కో ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ను లీజు పేరుతో ప్రైవేటీకరణ చేయడం లేదా. ఇప్పుడు ఇదే వైసిపి ప్రభుత్వ పెద్దలు ఏమని సమాధానం చెబుతారు. తమకు ఎటువంటి సంబంధం లేదని, ఎప్పుడు చెప్పే విధంగానే డప్పులు కొడుతూ మభ్యపెట్టే మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేస్తారా. ప్రజలు అయితే మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. ఏపీ జెన్ కోను లీజు పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి తమ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.ఈ విషయాన్ని జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకుల ద్వారా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ జెన్ కో ఉద్యోగులు చేస్తున్న నిరసనకు సంపూర్ణ మద్దతు ప్రకటించేలా కృషి చేస్తాం. ఏపీ జెన్ కో ఉద్యోగులకు అండగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ ఉంటుంది. ఉద్యోగులకు నిరసన తెలిపిన వారిలో జనసేన నాయకులు వీరబాబు, గిరీష్, పవన్, అవినాష్, సాయి, సుకుమార్, స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తదితరులు ఉన్నారు.