వంగిమళ్ల పంచాయతీలో నిధుల గోల్మాల్

*ఈవోపీఆర్డీపై అధికారిక ఫిర్యాదు

వీరబల్లి, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల గ్రామ పంచాయతీ నిధులు అక్రమంగా వాడబడుతున్నాయంటూ, ఈవోపీఆర్డీ రామచంద్రా రెడ్డిపై గ్రామస్థులు, టీడీపీ నాయకులు జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3.47 లక్షలు పంచాయతీ నిధులను అధికారికంగా కాకుండా వైసీపీ వాలంటీర్లు మరియు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి జమ చేసి తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సమర్పించిన వారు, తక్షణ విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో టీడీపీ మండల అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, నేతి రమేష్ బాబు, ప్రతాప్ రెడ్డి, రామ్మోహన్, మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment