సీసీ కెమెరాల కోసం నిధుల సేకరణ

నరసాపురం పట్టణ మున్సిపల్ హాల్‌లో సీసీ కెమెరా ప్రాజెక్ట్‌కు నిధుల సేకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, నేరాల నివారణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో అవసరమని తెలిపారు. పట్టణ భద్రత మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ఈ దిశగా నిధుల సేకరణకు ప్రజల మద్దతు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఇలాంటి ప్రజాభాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతాయని ఎమ్మెల్యే నాయకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, డీఎస్పీ వేద, సీఐ యాదగిరి, మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ సభ్యులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment