అంత్యక్రియలకు డా. కందుల ఆర్థిక సహాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గం: స్థానిక 34వ వార్డు తారకరామా కాలనీలో మృతి చెందిన పి.రవణమ్మ కుటుంవానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. వారికి కుటుంబాన్ని ఆదుకున్నారు. మృతి చెందిన రవణమ్మ అంత్యక్రియలకు ఆయన ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ మానవ సేవే, మాధవ సేవ అన్నారు.
ప్రతీ ఒక్కరూ మానవత్వంతో స్పందించి సాటి వారికి సహాయం చేయాలని కోరారు. సేవే దైవం అని చెప్పారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయడం వలన చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తామని అన్నారు. వార్డు పరిధిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కె.కృష్ణ, భారతి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment