మరింత క్షిణించిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యo

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనావైరస్  సోకిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌ ఆసుపత్రిలో చేరారు. అదే రోజున బాలసుబ్రహ్మణ్యం ఫేస్‌బుక్‌ లైవ్ వీడియోలో తనకు కరోనా లక్షణాలు చాలా తక్కువే ఉన్నాయని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతానని తన అభిమానులకు చెప్పారు.

తాజాగా ఆసుపత్రి అధికారులు విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం, ఆగస్టు 13న ఎస్‌పిబి ఆరోగ్యం క్షీణించిందని.. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్టుపై క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారని వెల్లడించారు.

ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ప్రకారం, SPB ని ICU కి తరలించినట్టు, అలాగే అతని హేమోడైనమిక్, క్లినికల్ పారామీటర్స్‌ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిపుణులైన డాక్టర్ల బృందం నిరంతరం SPB ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎదేమైనా లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.