39వ డివిజన్ లో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం సతీష్ & నగేష్ ల ఆధ్వర్యంలో గురువారం 39వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఏనాడైతే ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటినుండే భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. అసలు నిర్మాణరంగం మొత్తం ఆధారపడే ఇసుకని అడ్డం పెట్టుకుని కార్మికుల కడుపు కొట్టి తద్వారా వారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే అదే ఇసుకతో తమ అక్రమ సంపాదనతో ఆకాశహర్మ్యాలు కట్టుకుని విలాసవంతంగా బతుకుతున్న నిరుపేద జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తుకొస్తున్నాడనీ, చరిత్ర మళ్ళీ పునరావృతం అవ్వడం ఖాయమన్నారు. దీనిపై ముందుగా తమ నాయకుడు పవన్ కళ్యాన్ గారు స్పందించి కవాతు కార్యక్రమాన్ని పెట్టి వారి తరపున పోరాటం చేసారని గుర్తుచేసారు. సాటి మనిషిగా తనవంతు సహాయాన్ని జనసేన పార్టీ ఆనాడు అందించిందనీ, భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సంక్ష్యేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల మానిఫెస్టోతో తమ జనసేన తెలుగుదేశం పార్టీలు అడుగులు వేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రాము, జీవన్, రాజు, రాకేష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.