అమలాపురం, ఉప్పలగుప్తం మండలంలోని ఉప్పలగుప్తం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న భవితా కేంద్రాన్ని సీ.ఎం.ఓ బొరుసు సుబ్రహ్మణ్యం ఎం.ఈ.ఓ-2 ఎస్.సత్య కృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించారు. భవిత కేంద్ర రికార్డులను మరియు పిల్లల యొక్క సామర్ధ్యాలను పరిశీలించారు. పదవ తరగతి రాస్తున్న దివ్యాంగ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిత పిల్లల ఎన్రోల్మెంట్ పెంచాలని సిబ్బందికి సూచించారు. తదనంతరం ఉప్పలగుప్తం ప్రాథమిక పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భవిత టీచర్లు సిహెచ్.గంగాదేవి, పి.వెంకటేశ్వర్లు, సి.జి.వి.దివ్య పాల్గొన్నారు.
Share this content:
Post Comment