కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నలూరు మండలంలో అభివృద్ధి ఎక్కడ?
  • పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో కొత్తసింగరబొట్లపాలెం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిరహించడం జరిగింది. వేడుకలలో భాగంగా జనసైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి, ఆ తర్వాత గ్రామంలోని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరపడం ఒక చరిత్ర, మార్పు మొదలైంది, ఓర్పుగా ఉండి రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు కూడా ఇస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, పొన్నలూరు మండలంలో అతి తొందరలో ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నలూరు మండలంలో అభివృద్ధి శూన్యం, జనసేనకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండని మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణ తిరుమలరెడ్డి, ఖాదర్ బాషా, పెయ్యల రవి, మదన్ మోహన్, భార్గవ్, అయినంపూడి నాగేంద్రబాబు, అయినంపూడి నరేష్, అశోక్, యాహోన్, దివాకర్, శామ్యూలు, సునీల్, సురేష్, క్రాంతి, సురేంద్ర, నరేంద్ర, నవీన్, బెనర్జీ, బాబు, కృపారావు మొదలైన జనసైనికులు పాల్గొన్నారు.