సమాజ అభివృద్ధికి మీ ఓటే పెట్టుబడి- జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: మన భారతదేశంలో ఓటర్లు అంతా జాగ్రత్తతో సక్రమమార్గంలో ఓటు హక్కును సద్వినియోగపర్చు కోవాల్సినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉందని సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు అన్నారు. సోమవారం సాయిప్రియ సేవాసమితి ద్వారా పిఠాపురం నియోజకవర్గం నందు ఓటరు జాగృతికరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో భాగం గొల్లప్రోలు నగరపంచాయతీ గాంధీనగరం గాంధీ విగ్రహం వద్ద స్వచ్ఛగొల్లప్రోలు సభ్యులచే మధ్యాహ్నం 11-30 గంటలకు ప్రారంభించబడింది. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రజాస్వామ్యదేశమైన మన భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంతో సక్రమమార్గంలో తమ తమ ఓటు హక్కులను సద్వినియోగపరచుకోవాలనే మంచి ఉద్దేశం, ఆదర్శవంతమైన భావాలు కల్గిన ఒక కరపత్రాన్ని ఓటర్లులకు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు గొల్లప్రోలు నగరపంచాయతీలో మొట్టమొదటిగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పిఠాపురం నియోజవర్గం నందు 25వేల కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని జ్యోతుల శ్రీనివాసు అన్నారు. 2024 ఏప్రిల్‌ నెలలో జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీలల సాధారణ ఎన్నికలలో ఓటర్లందరూ జాగృతితో తమ ఓటు హక్కును సక్రమమార్గంలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ సాయిప్రియ సేవాసమితి పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఓటర్లులను జాగృతి చేయాలనే మంచిఉద్దేశంతో ఓటరు జాగృతి కరపత్రాలు నియోజకవర్గం నందు 3 మండలాల పరిధిలో 1 మున్సిపాలిటీ, 1 నగర పంచాయతి పరిధిలో 25 వేల కాపీలను పంపిణీ చేయుటకు తగు ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగినదని జ్యోతుల శ్రీనివాసు అన్నారు. ఈ సందర్భంగా స్వచ్చగొల్లప్రోలు సభ్యులు కొసిరెడ్డి పరమేశ్వరరావు{రాజా} మాట్లాడుతూ సాయిప్రియ సేవాసమితి ఇటువంటి ప్రజాజాగృతి కార్యక్రమాలు చేపట్డి ఓటర్లులను జాగృతపర్చడం చాలా మంచి కార్యక్రమమని సాయిప్రియ సేవాసమితి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కొశిరెడ్డి రాజా, కొమ్ము సత్యనారయణ, చొడపుననీడి పులపరాజు, కొశిరెడ్డి త్రిమూర్తులు, చేదులూరి సత్యనారయణ, కంకటాల శ్రీనివాస్ రావు, జ్యోతుల శివ, రాపర్తి వీర్రాజు, మర్రి సత్తిబాబు, సఖినాల లచ్చబాబు, సాయిప్రియ సేవాసమితి కార్యదర్శి మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.