జి. మాడుగుల: యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

జి.మాడుగుల మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాలను అనుసరించి, మండల అధ్యక్షుడు మసాడి భీమన్న అధ్యక్షతన మండల పార్టీ నాయకులతో కలసి యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భీమన్న మాట్లాడుతూ జనవరి 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన యువశక్తి మన యువత మన భవిత అనే కార్యక్రమం జరుగుతుంది. కావున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువత అంతా అండగా ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే గ్రామాల్లోనూ మండల ప్రధాన కూడలి లో జనసేన పార్టీ యువశక్తి సభకి సంబంధించి కరపత్రాలు ప్రజలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తెరవాడ వెంకటరమణ, మసాడి సింహాచలం, కొర్ర భానుప్రసాద్, తల్లె త్రిమూర్తులు, నాగేశ్వరరావు, గసాడి ధర్మారావు, సంద్ర సోమన్న, పండు తదితర జనసైనికులు పాల్గొనడం జరిగినది.