ఆర్భాటాలకే గడప గడప కార్యక్రమం!.. వైసీపీపై మలగా రమేష్ ధ్వజం

  • నేతల వెంటే మున్సిపల్, పొలీసు, సచివాలయ ఉద్యోగులు
  • ప్రతీ కాలనీలో సమస్యలపై నేతలను నిలదీస్తున్న నగరవాసులు
  • ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే అక్కడ ఖాళీ కుర్చీలు దర్శనం
  • ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువు
  • వైకాపా నేతలకు జపం చేయడం మానుకొని, ప్రజా సమస్యలను పరిష్కరించండి
  • -38వ డివిజన్ కార్పొరేటర్, జనసేన ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్ ధ్వజం

ఒంగోలు: జగన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజలకు వరిగిందేమి లేదని 38వ డివిజన్ కార్పొరేటర్, జనసేన నగర అధ్యక్షులు మలగా రమేష్ ధ్వజమెత్తారు. ఆర్భాటాలకే తప్ప, ప్రజల సమస్యలను పట్టించునే నాధుడే కరువైయ్యారని బుధవారం పత్రికా ప్రటకన ద్వారా దుయ్యబట్టా. ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ యంత్రాంగం, పోలీసు, సచివాలయ ఉద్యోగులు ఉద్యోగ విధుల్లో లేకుండా మొత్తం స్టాఫ్ గడప గడపకు వెళ్లి వైకాపా నేతలకు జపం చేయడం సిగ్గు చేటన్నారు. అలా చేయడం వలన ఉద్యోగులు లేక ప్రభుత్వ కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయన్నారు. మరీ ముఖ్యంగా నగర కమిషనర్ నుండి సచివాలయ సిబ్బంది వరకు కార్యక్రమంలోనే వారి రోజు వారి సమయం గడుపుతున్నారన్నారు. ఇక పోలీసుల తీరు కూడా అలాగానే ఉంది. సిఐ క్యాడర్ నుండి కానిస్టేబుల్ వరకు గడప గడపలో నేతల వెంట ఉండటం తప్ప, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అక్కడ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. తిరిగి విధులకు ఎప్పుడు వస్తారో కూడా ఎక్కడ ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక గడప గడపలో కూడా ప్రజల నుండి నేతలకు నిరసన సెగ తగులుతోంది. ప్రతీ కాలనీలో నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని నేతలను నిలేసి అడుగుతున్నారు. చేసేదేమి లేక వారి వెంట ఎవ్వరూ రాక మున్సిపల్ యంత్రాంగాన్ని, పారిశుద్ధ్య కార్మికులను కూడా వదలకుండా వారి వెంట తిప్పుకుంటూ గడప గడపలో పబ్బం గడుపుతున్నారు. ప్రజలకు రక్షణ, భరోసా కల్పించాల్సిన పోలీసుల తీరు కూడా పలు విమర్శలకు దారి తీస్తోంది. పోలీసు స్టేషన్లో ఎవ్వరూ లేకుండా గడప గడపకు వెళుతున్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుడు ఎవ్వరూ లేకపోవడంతో వెనుతిరిగే పరిస్థితులు వచ్చాయి. ఇలా అధికారులు, పోలీసులు వారి కార్యాలయాలు వదిలి నేతల వెంట తిరుగుతుంటే.. పని మీద కార్యాలయాలకు వచ్చే ప్రజలు సంగతి ఏంటని రమేష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్యాలయాల్లో ప్రత్యామ్నాయ పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉద్యోగులను ఉంచాలని కోరారు. లేదంటే ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని వైకాపాతో పాటు ప్రభుత్వాధికారులను మలగా రమేష్ హెచ్చరించారు.