ఘనంగా గడ్డమణుగు శకుంతలమ్మ జయంతి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ మాతృమూర్తి కీర్తిశేషులు గడ్డమణుగు శకుంతలమ్మ 86 పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట అమ్మ సేవాసదనం వృద్ధాశ్రమంలో నిడారంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొని వృద్ధులకు కొత్త బట్టలు, పళ్ళు, ఆశ్రమానికి నగదు సాయం అందజేసారు. జి ఎస్ ఎన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారు గుమ్మం ముందుకు వస్తే వారి కష్టాన్ని తీర్చి పంపించే గొప్ప మనిషి గడ్డమణుగు రవికుమార్ అని, వారి తల్లి శకుంతలమ్మ జన్మదిన వేడుకలు వృద్ధులతో అనాధలతో చేసుకోవడం చాలా సంతోషం కలిగించిందని, తమ వంతు సహాయంగా జిఎస్ఎన్ ఫౌండేషన్ తరపున అందజేస్తానని అన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మా సేవాసదనం వృద్ధాశ్రమం మేనేజ్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.