అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన గాదె, బండారు

తెనాలి నియోజవర్గం, కొలకలూరు గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి పడుతున్న అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు మరియు రాష్ట్ర కార్యదర్శి బండారు రవి కాంత్ పరిశీలించారు.. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. కొలకలూరు గ్రామంలో ఎక్కువ శాతం మొక్కజొన్న పంట రైతులు ఉన్నందున ఈ అకాల వర్షాల వల్ల ఎక్కువ సంఖ్యలో వారికి నష్టం జరిగింది. రైతులు మేము అడిగినప్పుడు వారు ప్రతి సంవత్సరం ఏదో విధంగా మాకు ప్రకృతి నష్టాన్ని కలిగించిందని, మేము నష్టపోయామని తెలిసి కూడా ప్రభుత్వాలు ముందుకు వచ్చి మమ్మల్ని ఏనాడు ఆదుకోలేదని చాలా బాధపడుతూ తెలియజేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలలో ఈ మొక్కజొన్న పంటని కొనాల్సివున్న వారు కొనకుండా తాత్సారం చేయడం జరుగుతుంది. ఇలా అకస్మాత్తుగా వర్షాలు పడటం చేతికి వచ్చిన పంట తడిచి గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నందుకు చాలా బాధాకరంగా ఉంది.. ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు రైతులు మీద దొంగ ప్రేమ చూపించకుండా నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేసి త్వరగా ఆదుకోవాలని లేని పక్షంలో వారికి మద్దతుగా జనసేన పార్టీ తోడు ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, అడపా మాణిక్యాలరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, మాజీ కౌన్సిలర్ షేక్ జాకీర్ హుస్సేన్, మండల అధ్యక్షులు దివ్వెల మధుబాబు, యర్రు వెంకయ్య నాయుడు, జిల్లా కార్యదర్శిలు కృష్ణమోహన్, వేణుమాధవ్, ఎంపీటీసీ హరికృష్ణ, పసుపులేటి వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి చౌడేశ్వరావు, కనకయ్య, బొప్పన లక్ష్మి, కొల్లిపర సత్యనారాయణ, చల్లా శివకుమార్, బెల్లపు యశ్వంత్ కుమార్, హుస్సేన్, మల్లి, యడ్ల వెంకటేశ్వరరావు, అంకమ్మరావు, పున్నారావు, సీతారామరాజు నాయక్, తోట వంశి మరియు జనసైనికులు పాల్గొన్నారు.