గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన గుంటూరు నగర పరిధిలో ఉన్న 57 వార్డు అధ్యక్షులతో మరియు పార్టీ తరపున ఉన్న కార్పోరేటర్లతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు వార్డులలో ఉన్న సమస్యలను వార్డు అధ్యక్షులు గుర్తించి వాటిని కార్పోరేటర్లు ద్వారా కార్పొరేషన్ లో జరుగు కౌన్సిల్ సమావేశాలలో మాట్లాడించి సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకువెళ్లాలని అలాగే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను ప్రజలకి అందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు.

Share this content:
Post Comment