అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన గాదె

గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం లాడ్జ్ సెంటర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.