చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన గాదె

గుంటూరు: జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగున్నర సంవత్సరాలు అయిందని, ఇంతవరకు ఏ సెక్టార్ ప్రజలకు గాని, ప్రభుత్వ విభాగాన్ని గాని అభివృద్ధి చేయటం గాని, న్యాయం చేసిన పాపాన పోలేదని తెలియజేశారు. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం వస్తే ఆంధ్ర దోపిడీకి నిలయంగా మారిపోతుందని హెచ్చరించారు. అయినా ప్రజలు వినకుండా ముఖ్యమంత్రి చెప్పిన తప్పుడు హామీలకు భావోద్వేగానికి లోనై చరిత్రలో కనివిని ఎరుగని మెజారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇచ్చిన మెజార్టీని ప్రజల ఉపయోగం కోసం కాకుండా ప్రకృతి వనరులు దోచుకోవడానికి వైసిపి నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు ఉపయోగించుకుంటున్నారు. ఈసారి ఎలక్షన్లోనైనా సరే ప్రజలు బాగా ఆలోచించి జనసేన పార్టీకి పట్టం కట్టాలని తెలియజేశారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు చెన్నై వారు ఇచ్చిన తీర్పుని లెక్కచేయకుండా ప్రభుత్వం వారు అక్రమంగా ఇసుకత్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు. జిల్లాకు రేటు కట్టి అనగా ఉదాహరణకి గుంటూరు జిల్లా ఇసుక త్రవ్వకం మొత్తం పెదకూరపాడు ఎమ్మెల్యేకు నెలకు 20 కోట్లకు, కృష్ణాజిల్లా 18 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా 17 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా 16 కోట్లు ఈ విధంగా జిల్లాకు రేటు కట్టి నెలల వసూలు చేసుకుంటూ వందల కోట్ల సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని ఉద్దేశంతో, ముఖ్యమంత్రి గారికి కళ్ళు తెరిపించాలని రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడిని సాక్షాదారాలతో సహా నిరూపించడానికి జనసేన పార్టీ తన మిత్రపక్షాలైన బిజెపి మరియు తెలుగుదేశం పార్టీలతో కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీస్ శాఖ వారు సహకరించాలని గాదె వెంకటేశ్వర్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత విలాసాల కోసం ఇటీవల లండన్ వెళ్లడానికి 40 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారని, అలాగే విచ్చలవిడిగా ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని, ఇసుక అమ్ముకొని వేల కోట్లు దోచుకుంటున్నారని, ప్రతిపక్ష నేతల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, గుంటూరు పట్టణ నాయకులు శ్రీపతి భూషయ్య, మధులాల్, తుమ్మల నరసింహారావు, గంగరాజు, గోపిశెట్టి సాయి, చింతకాయల శివ తదితరులు పాల్గొన్నారు.