అమర్నాథ్ హత్య: ఘటనను ఖండించిన గాదె

కాకినాడ: రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి మండలం, ఉప్పాలవారిపాలెంకి చెందిన ఉప్పాల అమర్నాథ్ అనే యువకుడిని రెడ్లపాలెంకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి అతి దారుణంగా శుక్రవారం ఉదయం సజీవ దహనం చేసిన సంఘటన విషయమై జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కాకినాడ నుండి స్పందించడం జరిగింది. ప్రభుత్వ చేతకానితనం వలనే ఇలాంటి దారుణమైన ఘటనలు రేపల్లెలో తరచూ జరుగుతూ ఉన్నాయని చెప్పారు. ఇలాంటి దారుణమైన ఘటనని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా మరియు దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ యువకుడి మృతికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి మద్దతుగా జనసైనికులు నిలబడాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం కొనసాగిస్తారు.