గుండిమెడ ప్రాంతంలో ఇసుక క్వారీలను సందర్శించిన గాదె

మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం, గుండిమెడ ప్రాంతంలో ఇసుక క్వారీలను జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. కృష్ణా నది గుండిమెడ ప్రాంతానికి చెందిన ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలను చూస్తుంటే ప్రకృతి సంపాదనంతా వారు అధికారంలో ఉన్నప్పుడే దోచెయ్యాలనుకుంటున్నారని స్పష్టంగా అర్ధం అవుతుంది. రాష్ట్రంలో రోడ్లు లేవు గాని కృష్ణ నది ఇసుక క్వారీలో ఇసుకని దోచుకోవడానికి పెద్ద పెద్ద లారీలు కూడా సులువుగా తిరిగేందుకు వీలుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలని తప్పుబడుతూ ఎన్.జి.టి కోర్ట్ స్టే విధించింది. వీటిని పర్యవేక్షిస్తున్న జెపి వెంచర్స్ సంస్థపై 18 కోట్ల రూపాయల పెనాలిటీని విధించింది. అంటే వీళ్ళు ఎంత అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. జెపి వెంచర్స్ వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే.. మట్టిని తరలిస్తున్న లారీలను చుస్తే 18 టన్నులు లోపల మాత్రమే లారీలో మట్టిని నింపాలి అనే నియమాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక్కో లారీలో 36 నుండి 50 టన్నుల మట్టిని తరలిస్తున్నారు. ఈ ఇసుక రీచ్ కి పర్మిషన్ ఉందా అని అధికారులని అడిగితే వారి నుంచి సరైన స్పందన లేదు. ఇక్కడి వారి చెప్తున్న దాని బట్టి 15 హెక్టార్ల వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ ఇక్కడ 100 హెక్టార్లకు పైగా మట్టిని తవ్వేస్తున్నారు. కూత వేటు దూరంలో ఇక్కడ వారధి ఉంది. సహజంగా బ్రిడ్జి నుండి 15 కిలోమీటర్ల తరువాత ఇటువంటి తవ్వకాలు చేసుకోవచ్చు. కానీ ఈ తవ్వకాలు జరుగుతున్నా చోటు నుండి వారధి 2 కిలోమీటర్లు కూడా లేదు. దీని బట్టి ముఖ్యమంత్రి గారి వైఖరి స్పష్టంగా నర్ధం అవుతుంది. ఏమి కూలిపోయినా పరవాలేదు నాకు మాత్రం డబ్బులు కావలి, దానికోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం అనే మనస్తత్వం ఆయన చేర్యలలొ చాల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇసుక రీచ్ ల వద్ద గోతుల్లో పడి ఎంతో మంది ఇప్పటికే చనిపోయారు. నిన్న కూడా లారీలో ఒక కుర్రాడు చనిపోయాడు. స్థానికంగా ఉన్న కథనాల బట్టి చుస్తే డబ్బులు దగ్గర తేడా వచ్చి అతనిని బకెట్ తో కొట్టి చంపేశారు. అతని శవాన్ని ఇసుకతో పూడ్చేసి పొరపాటున జరిగిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్.కే గారిని జనసేన పార్టీ తరుపున ప్రశ్నిస్తున్నాము.. గతంలో తప్పులు జరిగిపోతున్నాయి అని కోర్టులు చుట్టూ తిరిగిన ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏమయిపోయాయరు? ఆయనకి ఇవన్నీ కనిపించట్లేదా? అవతల వాళ్ళు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పా? నదిలోకి ట్రాక్టర్ కూడా దిగకూడదు, కానీ పెద్ద పెద్ద జేసీబీలు నదిలోకి దింపి అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ చర్యలకు స్థానిక ఎమ్మెల్యే ఆర్.కే, వైసీపీ నాయకులూ సిగ్గు పడాలి. జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షగానమే ఈ తవ్వకాలని ఆపాలి, లేని యడల మేము జేసీబీతో వచ్చి మీరు ఏర్పాటై చేసుకున్న మార్గాలని ధ్వంసం చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతంపూడి విజయ శేఖర్, జిల్లా నాయకులు నారదాసు ప్రసాద్, నెల్లూరు రాజేష్, అంకమ్మరావు, ఎడ్ల వెంకటేశ్వరరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, ఎర్రబాలెం గ్రామ అధ్యక్షులు కాపరౌతు. సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.