జనసేన పార్టీలో చేరిన గాదెగుంట గ్రామం

పాడేరు: జిమాడుగుల మండలం, నుర్మతిపంచాయతీ గాదిగుంటగ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న, మరియు తల్లె త్రిమూర్తులు, కిల్లో రాజన్ అడ్వకేట్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గంగులయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో సమావేశమై గ్రామ సమస్యల విషయమై చర్చించుకోవడమైనది ఈ సందర్భంగా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రస్తుత గిరిజన రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పరిస్థితులపై వారికి వివరిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ నమ్మిన మార్పు కొరకు రాజకీయ ప్రజాపాలన విషయమై గాదెగుంట గ్రామస్తులకు చెప్పారు. అనేక అనిశ్చితి పరిస్థితులపై ప్రస్తుత ఆదివాసీ ప్రజల సమస్యలపై సరైన పరిస్కారం కేవలం జనసేన పార్టీ మాత్రమే పరిష్కరించగలదని ఈ వైసీపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రజలను అస్థిరపరిచే కుట్రలు చేస్తుందని దానిని నమ్మే స్థితిలో గిరిజనం లేరని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు, వార్డు మెంబర్ వంతల నాగేశ్వరరావుతో సహా మహిళలు, యువత భారీ సంఖ్యలో పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు. వారిని పార్టీలోకి ఇన్చార్జ్ గంగులయ్య సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయితి నాయకులు తల్లే త్రిమూర్తి, మండల అధ్యక్షులు మసడి భీమన్న కార్యనిర్వహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్ బూత్ కన్వీనర్ కొర్ర భాను ప్రసాద్, చింతపల్లి మండల బూత్ కన్వీనర్ ఉల్లి సీతారాం, తల్లె కృష్ణ, ఓలేసు, కే కోటి, రాము, వి సోమరాజు, అంగధరావు, వీరమహిళ గండేరి పార్వతి పెద్దఎత్తున గాదె గుంట గ్రామస్తులు పాల్గొన్నారు.