జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా గాజువాక జనసేన

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధ్యక్షులు శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు సంఘీభావంగా కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద దీక్ష చేసిన జనసైనికులు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ మంగళగిరిలో చేపట్టిన సంఘీవభావ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు మరియు గాజువాక నియోజక వర్గం ఇంచార్జ్ శీ కోన తాతారావు సూచన మేరకు కూర్మన్నపాలెం వద్ద వున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిభిరంలో గాజువాక నియోజకవర్గ జనసేనపార్టీ కార్పోరేటర్ అభ్యర్థులు, జనసేన పార్టీ సీనియర్ నాయుకులు, జనసైనికులు, ఉక్కు ఉద్యోగులు, ఉక్కు నిర్వాసితులు మరియు అధిక అధిక సంఖ్యలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గవర సోమ శేఖర్ రావు, కాధ శ్రీను, ముమ్మన మురళి, రౌతు గోవింద్, కర్ణం కనకారావు, గోపీచంద్, భాస్కర్ రాజు, దాసరి త్రినాధ్, మేడశెట్టి విజయ్, జెరి)పోతుల రమణ, మల్లిపూడి మురళి, శాలిని, కే వి ఎస్ న్ రాజు, వెంకట రమణ, దుబాయ్ నరసింగరావు, గవర నరసింగరావు, కోట శ్రీధర్, శ్రీను, కె. సుధాకర్, ముద్దు సతీష్, రామలక్ష్మి, అనురాధ, వంశీ, సుంకర శ్రీనివాస రావు, బదుల శ్రీను, పట్టాభి, చిత్తా లక్ష్మణ, బుదిరెడ్డి అప్పారావు, బోనెల స్వరాజ్, తుగాల శ్రీనివాస రావు, జ్యోతి రెడ్డి, అప్పల రెడ్డి, డ్ నూక రాజు, ఎస్ శ్రీనివాస్ ఇతర జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిజాయితీతో పనిచేస్తుందని. అధికార పార్టీ జీవీఎంసీ ఎలక్షన్స్ ముందర దొంగ పాదయాత్రతో ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్స్లో లబ్ధి పొంది ఎలక్షన్స్ అయిపోయాక నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని అన్నారు. జనసేన అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిని ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి అఖిలపక్షాన్ని న్యూ ఢిల్లీకి తీసుకుని వెళ్లి పోరాటం చేయవలసిందిగా కోరి తగిన సమయం ఇచ్చినప్పటికీ ఏ విధమైన స్పందన లేకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేసులు మాఫీ కోసం కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవ మైన విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు దీక్ష చేస్తున్న జనసేన అధ్యక్షులకు, జనసేన నాయకులకు, అఖిలపక్ష నిర్వాసిత సంఘ నాయకులకు, ఉక్కు పరిరక్షణ సమితి ఉద్యోగ సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు ఐక్య పోరాట సమితి చేసే ఏ పోరాటానికైనా జనసైనికులు, ఉక్కు నిర్వాసితులు మద్దతు ఉంటుందని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని తెలియజేశారు.