టిడిపి రాష్ట్ర బంద్ కు గాజువాక జనసేన మద్దతు

గాజువాక నియోజవర్గం: ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ కు జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ సంఘీభావం తెలియజేయడం జరిగినది. దీంట్లో భాగంగా రాష్ట్ర పిఏసీ సభ్యులు, గాజువాక నియోజవర్గం ఇంచార్జ్ జనసేన పార్టీ కోన తాతారావు పిలుపుమేరకు 75వ వార్డులో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బందులో పాల్గొని నిరసన తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కోన చిన అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా వీళ్ళకి అధు నూతనమైనటువంటి శిక్షణ ఇచ్చి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని నాటి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగినది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు 271కోట్ల అవినీతి జరిగిందని, జగన్ గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది చంద్రబాబు నాయుడు గారిని ఏ 37 గా చూపించడం మరి ఏ వన్ నుంచి 36 అరెస్టు చేయకపోవడం ఏ 37నే అరెస్టు చేయడం అంటే అది పూర్తిగా కక్ష సాధించే పని అని అన్నారు. ప్రశ్నించే గొంతు ని అనగా తొక్కుతాను అన్న రీతిలో ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుందని ప్రతిపక్షాలన్నీ ఏకమవలిసినటువంటి అవసరము ఆసన్నమైందని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే విదంగా ఉమ్మడి ఉద్యమాలు చేయాలని అన్నారు దీనిని జనసేన పార్టీ ఖండిస్తున్నది అన్నారు. 75వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నమ్మి అప్పారావు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ ఓ బి సి సెక్రెటరీ శ్రీముసిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతు నొక్కుతుందని ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులతో భయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అంజూరి దీపక్, ములకలపల్లి వంశీ, నమ్మి లోకేష్, నీలపు శ్రీనివాస్ రెడ్డి, నీలాపు అప్పల రెడ్డి, స్టీల్ ప్లాంట్ ఏఐటిసి నాయకులు మరియు జనసేన పార్టీ ఉరుకూటి అప్పారావు, టిడిపి నాయకులు అండిబోయిన రామనాయుడు, ఎం పెంటయ్య, జె.ఎస్.పి నాయకులు స్టీల్ ప్లాంట్ హెచ్.ఎం.ఎస్ నాయుకుడు కోన రమణ, కోన అప్పారావు, కేతా రమేష్, కోన చంటి, కోన సింహాచలం, కోన గురప్ప, పేయంటర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.