‘నా సేన కోసం నా వంతు’కు గల్లా హర్ష లక్ష రూపాయల విరాళం

అనంతపురం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భగంగా అనంతపురం నియోజకవర్గ జనసేన నాయకులు గల్లా హర్ష స్వచ్ఛందంగా ₹1,00,000/- లక్ష రూపాయల చెక్కుని జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు పొదిలి బాబురావు లకు అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు అర్బన్ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు గల్లా హర్షకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.