అంబేద్కర్‌ కు ఘన నివాళులర్పించిన గంధం ఆనంద్

మధిర నియోజకవర్గం: పేదింట్లో వెలిగిన దీపంలా, భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థిక వేత్తగా, నాయ శాస్త్రవేత్తగా ఎదిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66 వ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మధిర నియోజకవర్గం జనసేన విద్యార్థి విభాగ నాయకులు గంధం ఆనంద్ పూలమాల వేసి ఘన నివాళులులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు భారతరత్న, భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ కు ఘన నివాళులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవా గౌడ్, మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు కాషిమ్ తదితరులు పాల్గొన్నారు.