ఘనంగా గణేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు..

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గోదావరి జిల్లాల ఎన్నికల నిర్వహణ కో కన్వీనర్ నున్న గణేష్ నాయుడు జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్వగృహం నందు జనసే రాష్ట్ర, జిల్లా, 23 గ్రామాలు అధ్యక్షులు, కమిటీ నాయకులు హాజరైన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో గణేష్ నాయుడు భారీ కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు గణేష్ నాయుడుకి ఉందని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భోగి రెడ్డి కొండబాబు, భోగి రెడ్డి గంగాధర్, యాళ్ల హరినాథ్ వెలుగుబంట్ల సూరిబాబు, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, సుధీర్, మెండు గోవిందు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-26-at-8.30.28-PM-1024x683 ఘనంగా గణేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు..

Share this content:

Post Comment