అమలాపురం, గారపాటి ఎన్ రావు (పండుబాబు – అమలాపురం)ను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ పీ జే యూ) ప్రధాన కార్యదర్శిగా చలాది పూర్ణ చంద్రరావు నియమించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ పీ జే యూ) సభ్యత్వం పొందిన వారి సంక్షేమం కోసం, వారికి ఏమైనా ప్రభుత్వపరంగా అన్యాయం జరిగితే మాత్రమే యూనియన్ సహకరిస్తుందని, వ్యక్తిగత సమస్యలపై ఏమాత్రం యూనియన్ సహకరించే అవకాశం లేదని, సభ్యులుగా చేరే వారు, ముందుగానే నిర్ణయించుకుని ఆమోదం అయితేనే ఏపీజేయు లో సభ్యత్వం పొందాలని వారు కొత్తగా సభ్యత్వం పొందదలచుకున్న వారిని కోరారు. 35వ వార్షికోత్సవం సందర్భంగా మూడు ప్రాంతీయ సభలు, మహాసభ నిర్వహణకు ప్రదేశాల నిర్ణయం జరిగిందన్నారు. సమావేశాలు నిర్వహణకు కొందరు యూనియన్ నేతలు ముందుకొచ్చారని, త్వరలో ప్రదేశాలు నిర్ణయిస్తామని ఏ పీజేయూ అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు మరియు ప్రధాన కార్యదర్శి చలాది పూర్ణచంద్ర రావు తెలిపారు.
Share this content:
Post Comment