బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం తక్షణమే మొదలు పెట్టాలి గర్భాన సత్తిబాబు!

పాలకొండ నియోజకవర్గం పొట్లి, నవగాం మధ్య ఉన్న వంతెన శిథిల స్థితిలో ఉన్న స్థానిక నాయకులు పట్టించుకోలేదంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు దృష్టికి తీసుకురావడం తో తక్షణమే స్పందించి చుట్టుపక్క గ్రామ జనసైనికుల తో వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలావస్థలో ఉన్న బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఇటు నుండి వెళ్లే ప్రయాణికులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది అని వెంటనే నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేయని యెడల జనసేన పార్టీ తరపున ఉద్యమం చేపడతామని తెలియ చేశారు.