లుంబూరు గ్రామ ప్రధాన సమస్యలపై ఎంపీడీఓ కి వినతి పత్రం సమర్పించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ మండలం, స్థానిక పాలకొండ – లుంబూరు మధ్య గల రోడ్డు మరమ్మతులు చేపట్టాలని “ఎంపిడిఓ” డొంక త్రినాధులు కి, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. లుంబూరూ గ్రామంలో బీసీ కాలనీలో రోడ్డు లేదని, కలువాలు లేకపోవడం వల్ల, నీరు నిల్వలు అధికంగా ఉండడం వలన, దోమలు వ్యాపించడం ద్వారా, అక్కడ నివసించే ప్రజలు దోమకాటుకు గురై, డెంగ్యూ, మలేరియా వంటి, వివిధ రకాల వ్యాధులు వ్యపిస్తుందడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, గర్భాన సత్తిబాబు తెలియపరిచారు. వివరణ అనంతరం ఎంపీడీవో స్పందించి, తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని, లుంబూరు బీసీ కాలనీ సీసీ రోడ్డుకి నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, డొంపాక సాయి కుమార్, మాదసి సంతోష్ కుమార్, రమేష్ పాల్గొన్నారు.