గర్భాన సత్తిబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన సీతంపేట జనసైనికులు

పాలకొండ, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబుని సీతంపేట మండల జనసైనికులు పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. మరియు మండలంలో వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీనీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మరియు సీతంపేట మండలంలో జనసైనుకులు అనుసరించాల్సిన తీరును గర్భాన సత్తిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో సీతంపేట మండల నాయకులు శ్రీకాంత్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.