ఘనంగా గాయత్రీ మహాయజ్ఞం

*జనసేన నేత గునుకుల కిషోర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం

నెల్లూరు సర్వోదయ కాలేజీ ప్రాంగణంలో గాయత్రీ పరివార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 108 కలశములతో గాయత్రీ మహా యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. లోక కళ్యాణం, విశ్వ శాంతి, కాలుష్య నివారణకు శాంతియుత ప్రకృతి సాధన కోసం నిర్వహించిన ఈ యజ్ఞంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ మహాయజ్ఞంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సతీమణి విజయలక్ష్మి కూడా పాల్గొనడం విశేషం. యజ్ఞానికి కావలసిన పూజా సామగ్రి అన్నింటినీ ఉచితంగా సమకూర్చి, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పాటుపడుతున్న నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు. పవిత్ర గాయత్రీ మంత్రోచ్ఛారణలతో మేళవించిన ఈ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, సమూహ చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది.

Share this content:

Post Comment