బంగారు పతకం సాధించిన పూజని అభినందించిన గెడ్డం బుజ్జి

పాయకరావుపేట, జనసేన పార్టీ వీరమహిళ అరుణ కుమార్తె పూజ స్టేట్ బాక్సింగ్ 75 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ జనసేనపార్టీ సీనియర్ గెడ్డం బుజ్జి పూజని దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని విజయాలు సాధించి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.