మార్కెట్ లోకి వచ్చిన ‘జియో పే’

జియో ఫోన్ ను వినియోగించే వారి కోసం జియో పే ను రిలీజ్ చేసినట్టు తాజా నివేదిక చెబుతోంది. డిజిటల్ చెల్లింపుల యాప్ ను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జియో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ నివేదిక ప్రకారం జియో ఫోన్ ను వినియోగించే వారికి దశల వారీగా జియో పే ఫీచర్ ను జియో అందుబాటులోకి తెస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దాదాపు 1000 మంది ఈ యాప్ టెస్టింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జియో కొన్ని రోజుల క్రితమే ఈ యాప్ ను రూపొందించినట్టు సమాచారం అందుతోంది. పేటీఎం ఇంటర్ ఫేస్ ఏ విధంగా ఉంటుందో జియో పే యాప్ ఇంటర్ ఫేస్ కూడా అదే విధంగా ఉండనుంది.

ఈ యాప్ ను జియో ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకున్న వాళ్లు సులువుగా డిజిటల్ లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే యాప్ ల ద్వారా ఏ విధంగా లావాదేవీలు జరుపుతున్నామో జియో పే యాప్ తో సైతం అదే విధంగా లావాదేవీలు జరపవచ్చు. జియో యాప్ అన్ని బ్యాంక్ లకు సపోర్ట్ చేసే విధంగా రూపొందించిందని సమాచారం. జియో రీచార్జ్ తో పాటు కాంటాక్ట్ లెస్ ఎన్.ఎఫ్.సీ పేమెంట్లు కూడా చేసుకోవచ్చు. యాప్ ద్వారా లావాదేవీల కోసం ఇప్పటికే యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ, ఇండస్ ఇండ్, స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ జియో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సమాచారం. మాస్టర్ కార్డ్, వీసా క్రెడిట్, డెబిట్ కార్డుల సహాయంతో చెల్లింపులు చేయవచ్చని జియో పేర్కొంది. కియోస్ ఆపరేటింగ్ సిస్టం వాడే యూజర్ల కొరకు జియో పే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ పిన్ సహాయంతో జియో యూజర్లు లావాదేవీలు జరపవచ్చు.