ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ కి ఘననివాళి

ఆత్మకూరు, భగత్ సింగ్ కి ఆత్మకూరు జనసేన పార్టీ ఘన నివాళి. జ్వలించే నిప్పు కణిక, భగ భగ మండే అగ్ని గోళం, భారత స్వతంత్ర సమరయోధుడు, విప్లవ యువ కెరటం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసైనికులతో కలిసి ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లకు విప్లవ జోహార్లు అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.