చంద్రబాబుతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఘంటసాల వెంకటలక్ష్మి

  • దెందులూరు నియోజకవర్గంపై చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఘంటసాల వెంకటలక్ష్మి

దెందులూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గెలుపుకి అనుసరించాల్సిన వ్యూహాలపై మరియు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జనసేన, బిజెపి నాయకులని, కార్యకర్తలని ఏ విధంగా కలుపుకుని నియోజవర్గంలో ముందుకు వెళ్తున్నారు అనే విషయాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నల్లజర్ల లో జరిపిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు దెందులూరు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులని వెంకటలక్ష్మిని అడిగి తెలుసుకొని, కూటమిలో ఉన్న మిగిలిన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎలాంటి బేశజాలకు పోకుండా, వారిని గౌరవిస్తూ, అవసరమైతే ఒక మెట్టు దిగి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, అప్పుడే మిగిలిన పార్టీల ఓట్లు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కి బదిలీ అయ్యి గెలుపుకి అవకాశం ఉంటుందని అన్నారు. వెంకటలక్ష్మి కూడా దెందులూరు నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులని, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్తున్నారు అనే విషయాలని చంద్రబాబుకి వివరించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన బిజెపి కన్వీనర్ గుమ్మడి చైతన్య, టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.