గిద్దలూరు సీటు జనసేనకే కేటాయించాలి!

  • కాపుల తీర్మానం

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో, అత్యధిక కాపు సామాజిక వర్గాన్ని కలిగిన, గిద్దలూరు నియోజకవర్గానికి, జనసేన టికెట్ కేటాయించాలని, కంభంలోనీ, ఓ ఫంక్షన్ హాల్ నందు, బుధవారం జరిగిన కంభం బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల కాపు నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మూడు మండలాల అధ్యక్షులు, కాసుల పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, జనసేనకు చెందినటువంటి నేతలు పాల్గొన్న, ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, కాపులకు రాజ్యాధికారం కావాలంటే, ప్రస్తుతం జరగనున్న ఎన్నికలే కీలకమని, కచ్చితంగా కాపులు, జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులను, ప్రతి చోటా గెలిపించుకున్నప్పుడే, రాబోయే రోజుల్లో, కాపుల చిరకాల కల, సాకారం అవుతుందన్నారు. 2009లో పిఆర్పి అభ్యర్థిని గెలిపించుకున్న ఘనత గిద్దలూరు నియోజకవర్గానికి ఉందని, రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి టికెట్ ను కేటాయించాలని వక్తలు పేర్కొన్నారు. పొత్తులో భాగంగా గిద్దలూరు టికెట్టు అధికారిక ప్రకటన వెలువడేంతవరకు కాపులు, ఏ రాజకీయ పార్టీ కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతనే, అందరం మరోసారి సమావేశమై, సమిష్టిగా నిర్ణయం గైకొందామని తీర్మానించారు. ఈ సమావేశంలో అర్ధవీడు మండల అధ్యక్షుడు మేడూరి వెంకట్రావు, పెద్ద కందుకూరు ఎంపీటీసీ, పోలు అనంతరావు, అయ్యవారిపల్లి సర్పంచ్ మురళి, తురిమెళ్ళ మాజీ సర్పంచ్ నారి శెట్టి వీరమ్మ, అయ్యవారిపల్లె మాజీ సర్పంచ్ శేషయ్య, జేబీ కృష్ణాపురం మాజీ సర్పంచ్ శెట్లెం రామకోటయ్య, తెలుగుదేశం పార్టీ కంభం మండల అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసులు, కాపు పెద్దలు తుపాకుల వెంకటయ్య, టిడిపి నాయకులు తోట శ్రీనివాసులు, పలువురు జనసేన నాయకులు, కాపు పెద్దలు పాల్గొని ప్రసంగించారు.