క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన గిద్దలూరు జనసేన

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజక వర్గం జనసేన పార్టీ అధ్యక్ష్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు నాయకత్వంలో క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా మూడవ రోజు అర్ధవీడు మండలంలో జరిగినది.

ఈ సందర్భంగా గిద్దలూరు నియోజక వర్గం జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ.. మనమందరం కలసి పని చేసి పవన్ కళ్యాణ్ గారినీ ముఖ్యమంత్రి గా చేసుకోవాలని కోరారు. నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించు కోవడానికి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నానని చెప్పారు, మీ అందరి సహకారంతో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు రావడానకి పనిచేస్తానని చెప్పారు. నేను అర్ధవీడు లో ఇంటర్ మీడియట్ చదువు కున్నాను కనుక 1000 మంది కార్మికులకు పనిచేసే విధంగా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. జిల్లా కార్యదర్శి లంకా నరసింహా మాట్లాడుతూ జనసేన పార్టీకీ ప్రజలు ఓట్లు వేయక పోయినా ప్రజా సమస్యల కోసం పని చేస్తున్నారు, కౌలు రైతులకు ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తున్నారు. కనుక జనసేన పార్టీకీ ఓట్లు వేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు.