పవన్ బాటలో గిడ్డి సత్యనారాయణ

  • పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని పవన్ స్ఫూర్తితో స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఉడిమూడి గ్రామానికి చెందిన జనసేన నాయకులు మాజీ పోలీసు ఉద్యోగి గిడ్డి సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేశారు అలాగే నియోజకవర్గంలో ప్రజా సేవకుడిగా ముందుకు దూసుకుపోతున్నారు. ఉద్యోగ రీత్యా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో పలు బాధ్యతలు నిర్వహించగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అకౌంట్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఎవరు కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా సత్యనారాయణ నిలుస్తూ ప్రజా నాయకుడిగా పేరుపొందారు. జనసేన నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గంలో శని, ఆదివారం పర్యటించారు ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలపై పరిష్కరించేలా ముందుకు సాగారు. ఈ పర్యటనలో సుమారు నాలుగు లక్షల రూపాయలు వికలాంగులకు వృద్ధులకు అనేక సేవలు ఆర్థికంగా చేయడం జరిగింది. దీనితో గిడ్డి సత్యనారాయణని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత సేవలో కొనసాగిస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసమే పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.