ఘనంగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి ఉత్సవాలు

ఆమదాలవలస, ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది అయిన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం అయిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట గ్రామంలో ఆయన విగ్రహానికి స్థానిక జనసేన పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా తనకు పేరు రావాలన్న ఆలోచన, పట్టింపు ఉండేవి కాదని అటువంటి మహనీయుడు జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల నాయకులు పైడి. మురళి మోహన్, దనుంజేయ,రమణ, జనార్ధన,ఈశ్వర్, సందీప్, నాగరాజు, తిరుపతి రావు, అనూష్, కోటి, ఫణి తదితరులు పాల్గొన్నారు.