పాలకొండ గెలుపే పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్

*జనసేన ప్రత్యేక సమావేశంలో టీడీపీ పై అసంతృప్తి

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన టీమ్ ప్రత్యేక సమావేశం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా పాలకొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు జనసేన బాధ్యతను తీసుకుని పార్టీ బలోపేతానికి అలుపెరగని కృషి చేశారన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన నాయకులు, కార్యకర్తలు ఒకే స్వరం నినాదం చేశారు – “పాలకొండకు జనసేన టికెట్ ఇవ్వండి, గెలుపు పవన్ కళ్యాణ్‌ గారికి మేము గిఫ్ట్ ఇస్తాం అని అనేవాళ్ళం కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలు మాత్రమే పోటీ చేస్తే మా పాలకొండ కి అనుకోని విధంగా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అన్నివిధాలుగా సమీకరణ చేసి శ్రీ నిమ్మక జయకృష్ణ గారికి జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుటి వరుకూ జనసేన టీడీపీ బీజేపీలో ఎవ్వరికి ఎన్ని విధాలుగా ఉన్నా అందరూ కలిసి పని చేసారు, కానీ ఒక్క టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నటువంటి శ్రీమతి పడాల భూదేవి గారు టీమ్ మాత్రం మా జనసేన పార్టీ ఎలాంటి సపోర్ట్ చెయ్యకుండా వైస్సార్సీపీ పార్టీకి ఇప్పుడు టీడీపీ అని కూటమి అని అనడం మా జనసేన పార్టీకి నచ్చడం లేదు. ఎందుకంటే ఒక వేల జయకృష్ణ గారు ఓడిపోతే జయకృష్ణ గారు ఓడిపోయారు అని ఈ రాష్ట్రంలో ఎవ్వరు అనరు జనసేన పార్టీ నే ఓడిపోయింది అంటారు. అలాంటిది 2014 నుంచి 2024 వరుకు పాలకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామ జనసేన నాయుకులు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని నమ్మి ఓటు వేసిన ప్రజలు జనసైనికులు వీరమహిలు ఎంతలా మేము ఎంతలా బాధపడతాం అనేది ఎవ్వరు ఆలోచించకుండా ఈ ఓటమి పవన్ కళ్యాణ్ గారు బాధపడితే మేము ఎలా భరించాలని అడుగుతున్నాం. జనసేన గెలుపుకు పని చెయ్యని కూటమిలో ఏ పార్టీ లో ఉన్నసరే మేము వాళ్ళని వైస్సార్సీపీ పార్టీ వాళ్ళు లానే పాకిస్తాన్ వాళ్ళ లాగానే చూస్తాం అని ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గం జనసేన టీమ్ తెలియజేయ్యడం జరిగింది. ఇక పైన ఐనా పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ బలోపేతానికి కూటమి నాయుకులు అందరూ కలిసి పని చెయ్యాలని పిలుపునిస్తున్నాం అని జనసేన జానీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పోగ్రామ్ కమిటీ మెంబెర్ పొట్నూర్ రమేష్, పొగిరి జగన్, జామి అనిల్, సవర రాజేష్, రఘుమండల గణేష్, సవర సింహాద్రి, గోలి అనిల్, సవర గణేష్, పక్కి ప్రేమ్ ఇతర జనసైనుకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment