జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం చిన్నారులకు బహుమతులు

అమలాపురం, మీలాద్ ఉన్ నభి మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అమలాపురం అషా నగర్ లో ఉన్న మసీదు నందు అమలాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ముస్లిం చిన్నారులకు బహుమతులు అందజేయడం జరిగింది. ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగ కార్యదర్శి మహదశ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందడి శ్రీను, జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, సీనియర్ నాయకులు సూదా చిన్న, ఆకుల బుజ్జి, గండి స్వామి, గుమ్మళ్ళ తాతయ్య కాపు, దంగేటి శ్రీహరి, సత్తి శీను, గొర్తి పవన్, పొణకల ప్రకాష్, మహ్మద్ షరీఫ్, మహ్మద్ షఫీ, షేక్ కరిముల్లా బాబా, మోకా బాలయోగి, కారెం వెంకట్రావు, చినబాబు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.