గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన మొదటి రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం సవర గోపాలపురం, సవర గూడ గిరిజన గ్రామాలో మంగళవారం గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమన్ని ప్రారంభించారు. గిరిజన నియోజకవర్గమయిన పాలకొండలో అనేక మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు మొదటి దశగా వందరోజుల కార్యక్రమానికి వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. గిరిజన ప్రాంతాల్లో – గుడిసె గుడిసెకు జనసేన పార్టీ మ్యానిఫెస్టో మరియు సిద్దాంతాలు గిరిజన ప్రజలకు అర్ధమయ్యే రీతిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మత్స పుండరీకం, జనసేన జాని, కర్ణేన సాయి పవన్ వివరించారు. గిరిసేన – జనసేన జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా మత్స పుండరీకం మాట్లాడుతూ… సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయం చేసిన రైతులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం జనసేన పార్టీ కల్పిస్తుంది అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు. అలాంటి నాయకుడుని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని మత్స పుండరీకం పిలుపునిచ్చారు. జనసేన జాని మాట్లాడుతూ మేము ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ముఖ్యంగా మహిళలకు అర్ధమైన రీతిలో జనసేన పార్టీ మేనిఫెస్టో వివరించడం జరిగింది. గిరిజన ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాతాలు గురించి వివరంగా చెప్పడం జరిగింది. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు.