అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: లోకం మాధవి

  • మెగా బైక్ ర్యాలీతో – జనసేనలో నూతన ఉత్సాహం

నెల్లిమర్ల: జనసేనకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం మాధవి మీడియా సమావేశంలో తెలియజేశారు.. జనసేన నాయకుడు లోకం మాధవి ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో జనసేన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి మాట్లాడుతూ 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలను ఆమె అభ్యర్థించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు, గ్రామస్థా యిలో తెలుసుకునేందుకు రానున్న రోజుల్లో పాదయాత్రలు నిర్వహి స్తామని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పార్టీల నాయకులు ను గెలిపించిన అభివృద్ధి శూన్యమే అని అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. ఈ నియోజక వర్గం మొత్తాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలియజేశారు. ర్యాలీ ప్రారంభించే ముందు ముంజేరు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో లోకం ప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ భోగాపురం నుంచి డెంకాడ మండలం అక్కివరం మీదుగా పూసపా టిరేగ నుంచి నెల్లిమర్లతో ముగిసింది. ఈ ర్యాలీకి చేసే నాలుగు మండలాల నుంచి భారీగా జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్త లు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిరాకిల్ సీఈఓ లోకం ప్రసాద్, తుమ్మి అప్పలరాజు దొర, పల్లంట్ల జగదీష్, పళ్ళ రాంబాబు, దిండి రామారావు తదితరులు పాల్గొన్నారు.