రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి: మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీలో ఆదివారం 116 వ రోజు పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంచుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేట పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు గురువి గారి వాసు, భాస్కర పంతులు, ఆచారి, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, వెంకటసుబ్బయ్య, జనసేన వీర మహిళలు జడ్డ శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.