ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సయ్యద్ నాగుర్ వలి

గుంటూరు: రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమానికి శ్రీ కారం చుట్టిన జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీని అధికారం వైపు అడుగులు వేయించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే ఉండి, అదిష్టానం ఆదేశాలు మేరకు ప్రజల పక్షాన అండగా నిలిచి ప్రతీ సమస్య మీద స్పందించి నకరికల్లు మండలం పార్టీ తరుపున చురుకైన పాత్ర పోషిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర అభివృద్ధి కై జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వమని అడిగారు. మీడియా తో తదుపరి కార్యాచరణ గురించి మాట్లాడుతూ ఇంటింటా జనసేన పార్టీ కి ఒక్క చాన్స్ కార్యక్రమం నకరికల్లు మండలం లో ప్రతీ గడప గడపకు వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు హామీ లతో కూడుకున్న మ్యానిఫెస్టో కరపత్రాలను పంచి, పార్టీ ఆశయాలను ప్రజలకు వివరిస్తామని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడమే తమ ధ్యేయమని, పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యత ను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. జన సైనికులు నాయకులు వీర మహిళలతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. నకరికల్లు మండలంలో ప్రతి అక్క చెల్లెమ్మ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే మోసాలు అన్ని తెలుసుకుంటున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ ని చూస్తామని ప్రజలు చెప్తున్నారు అని ఆయన అన్నారు.