పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వండి: డా. యుగంధర్ పొన్న

  • జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం
  • పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయం
  • తద్వారా అంతిమ అధికారం ప్రజల చేతుల్లోకి చేర్చడం తథ్యం
  • ఒక్కసారి జనసేనానికి అవకాశం ఇవ్వండి
  • ప్రజలను విజ్ఞప్తి చేసిన జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం, కార్వేటినగరం గ్రామపంచాయతీలోని, ఈస్ట్ ఏ ఏ డబ్ల్యూ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మనసులో స్థానం సంపాదించడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించడం, ఆ సమస్యల్ని సంబంధిత ప్రభుత్వాధికారులకు నివేదించడం, వినతి పత్రాలు సమర్పించి ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విరోచితమైన పోరాటం చేస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన సేవాభావాన్ని, సేవా తత్పరతను, నిస్వార్ధంగా తీసుకున్న సేవలను ప్రజలకు వివరించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. తద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టి, అంతిమ అధికారం ప్రజల చేతుల్లో పెట్టి సరైన ప్రభుత్వ పాలన అనగా, సంపద సృష్టించి, సంక్షేమ పథకాలు పగడ్బందీగా అందించే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారని తెలిపారు. అందుకే ఒకసారి పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామంలో మూడు ప్రధానమైన వీధుల్లో సిమెంట్ రోడ్లు కొత్తగా వెయ్యాలని, సంబంధిత అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న యువత ఉపాధి లేక, ఉద్యోగం లేక నిరుద్యోగంతో సతమతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సరైన ఉపాధి చూపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, అయితే అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనపడలేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 500 మంది చిన్న కంపెనీలు పెట్టే విధంగా, దాన్ని ప్రోత్సహించడానికి పది లక్షల రూపాయలు పెట్టుబడిని తిరిగి చెల్లించని డబ్బు ఇచ్చి, పదిమందికి ఉపాధి కల్పించే విధంగా చేస్తారని ఈ సందర్భంగా యువతకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు శివప్రసాద్, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేంద్ర, మణి, టౌన్ కమిటీ కార్యదర్శి మీనా, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటినగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, జనసైనికులు పాల్గొన్నారు.