పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి

  • పవనన్న ప్రజాబాట 35వ రోజు
  • ఓడిపోయినా ప్రజల బాగోగుల కోసం పోరాడుతున్నారు.
  • యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఇలా అన్నివర్గాల వారికి అండగా నిలబడ్డారు.
  • చంద్రబాబు నాయుడుని చూసారు, జగన్ మోహన్ రెడ్డిని చూసారు, ఈసారి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకుందాం.
  • అవినీతి లేని పాలన అందిస్తూ ప్రజలకు కష్టం అనేది తెలీకుండా పవన్ కళ్యాణ్ కాపు కాస్తారు.
  • పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట ఇంటింటికీ తిరిగి ప్రజాసమస్యలు అధ్యయనం చేసే కార్యక్రమం 35వ రోజున స్థానిక 4వ డివిజన్ మైపాడు రోడ్డు సత్యనారాయణపురం, నేతాజీ నగర్ ప్రాంతంలోని పలు వీధులలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలుకరించిన కేతంరెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. ప్రతి సమస్యను సావధానంగా విన్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తమ వంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న సుమారు మూడు వేల కౌలు రైతు కుటుంబాలకు అండగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలను పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన దాంట్లో నుండి ఇస్తున్నారని తెలిపారు. ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 74 కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించారని తెలిపారు. అధికారం లేకపోతేనే ప్రజలకు ఇంతలా అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ అధికారం వచ్చాక ప్రజల్ని ఎంత బాగా చూసుకుంటారో అర్థం చేసుకోవాలని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా ఈ మూడేళ్ళ పాటు రాష్ట్రంలోని యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఇలా అన్ని వర్గాల వారికి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారని తెలిపారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేసే వ్యక్తి కాదని, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేసే శక్తి పవన్ కళ్యాణ్ అని కేతంరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని చూసారని, జగన్ మోహన్ రెడ్డిని చూస్తున్నామని, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పులు కనిపించాయా అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలందరూ తమ ఆశీస్సులు అందించి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతి లేని పాలన అందిస్తూ ప్రజలకు కష్టం అనేది తెలీకుండా పవన్ కళ్యాణ్ కాపు కాస్తారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.