తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి: శేషుబాబు

  • మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమంలో రైతులకు అండగా జనసేన తరఫున జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

అవనిగడ్డ: మాండూస్ తుఫాన్ కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బ తిన్న వరి పంటకు కూలీ ఖర్చుల కోసం తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు ప్రకటించాలని, తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం ను కొనుగోలు చేయాలని, డ్యామేజ్ అయిన పంటకు ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలని, రవాణా మరియు హమాలీ చార్జీలు రెట్టింపు చేయాలని, రబీ పంటకు విత్తనాలు సరఫరా చేయాలని, కోరుతూ అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సహకారంతో సోమవారం మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉంటే రైతు భరోసా కేంద్రాలలో రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని, అసలే వర్షం కారణంగా వరి పంట తడిసి రైతు పీకల లోతు కష్టాలలో ఉంటే దాన్యం రేటు తగ్గించి కొనడం దారుణం అని, రబీ పంటకు ఇప్పటికి కూడా విత్తనాలు సరఫరా జరగలేదని, స్వంతగా కొనుగోలు చేసి పొలంలో చల్లుకున్న విత్తనాలు నీటిలో మునిగిపోయాయని, వెంటనే విత్తనాలు సరఫరా చేయాలని అలాగే డ్యామేజ్ అయిన వరి పంటకు ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలని ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, విత్తనం నుండి విక్రయం దాకా అన్నీ మేమే చూసుకుంటాం అని చెప్పి రైతులను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల పార్టీ అధ్యక్షులు మర్రే గంగయ్య, పిట్టల్లంక సర్పంచ్ కనగాల వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు ఉల్లి శేషగిరి, ఎంపీటీసీ సిద్దినేని కుమార్ రాజా, ఎంపీటీసీ బాప్పన భాను, నారిపాలేం శంకరరావు, అప్పికట్ల శ్రీ భాస్కర్, రేపల్లె రోహిత్ తదితరులు పాల్గొన్నారు.