మాకు విద్యార్హతకు తగ్గ ప్రమోషన్లు ఇప్పించండి

  • చిల్లపల్లిని కలిసి న్యాయం చేయాలన్న అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ ప్రతినిధులు
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల దృష్టికి తీసుకెళ్తానన్న చిల్లపల్లి

మంగళగిరి, గ్రామ సచివాలయ వ్యవస్థలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను వివిధ ఇంజనీరింగ్ శాఖలలో విలీనం చేసి విద్యార్హతలకు తగ్గ ప్రమోషన్ ఛానల్ కల్పించాలని.. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఆఫీసులో ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో 9,000 మంది, గత ఐదు సంవత్సరాలుగా బీటెక్, డిప్లమో వంటి విద్యార్హతలు ఉన్నా.. ఎస్.ఎస్.సి విద్యార్హత కలిగిన బ్లూప్రింట్ ఆపరేటర్స్ కింద రిక్రూట్ చేయడం జరిగిందని చిల్లపల్లికి తెలియజేశారు. కనీస విద్యార్హతను గుర్తించి.. పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, హౌసింగ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ మెడికల్ కార్పొరేషన్ వంటి ఇంజనీరింగ్ శాఖలలో ప్రమోషన్ చానల్ ని కల్పించాలని చిల్లపల్లిని కోరారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్, స్టేట్ ప్రెసిడెంట్ యువ షణ్ముఖ, జాయింట్ సెక్రెటరీ జె నాగరాజు, కృష్ణాజిల్లా టెక్నికల్ సెక్రటరీ జి నాగరాజు, ఉమెన్స్ సెక్రటరీ హీరా, అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు, ఫణీంద్ర వర్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment