‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి గ్లింప్స్ రిలీజ్

సుధీర్‌ బాబు హీరోగా కరుణ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీ దేవి సోడా సెంటర్‌’. లైటింగ్‌ సూరిబాబు పాత్ర పోషిస్తున్నారు సుధీర్‌. మంగళవారం సుధీర్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు సుధీర్. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ వీడియోకి మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. 80ల కాలం నాటి అమలాపురం నేపథ్యంగా సాగే ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనునంది. ఈ చిత్రాన్ని విజయ్‌ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు. నాయిక వివరాలు ఇంకా ప్రకటించలేదు. ‘పలాస’ తర్వాత కరుణ కుమార్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’పై అంచనాలు పెరుగుతున్నాయి.