విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం స్థానిక ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు సమక్షంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు రామ్ చరణ్ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారన్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నారన్నారు.
గ్లోబల్ స్టార్ గా ఎదిగినా తన అంకితభావం, వినయం మారలేదన్నారు. సేవ రంగంలో కూడా తండ్రి ని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు అధికంగా నిర్వహిస్తున్నారన్నారు. రామ్‌చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రార్థించారు. మెగా ఫ్యామిలీ ఆశయ సాధనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం మెగా అభిమానులు జనసేన నాయకుల సమక్షము లో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్టాడ కనికం నాయుడు, ఎచ్చెర్ల లక్ష్మనాయుడు, సూరి నాయుడు, నరసింహ సత్యనారాయణ, సింహాచలం, శ్రీను, జనసేన శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment